calender_icon.png 15 November, 2024 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 సజావుగా నిర్వహించాలి

14-11-2024 01:17:32 AM

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఈనెల 17, 18వ తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్య ర్థులు హాజరుకానున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్ బుధవారం టీజీపీఎస్సీ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆమె మాట్లాడుతూ మొత్తం 1,401 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి..

గతానికి మించి వరి దిగుబడి వస్తున్నందున క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదాంలకు ధాన్యం రవాణా చేసి, రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. కొత్తగా మంజూరైన నర్సింగ్ కాలేజీల్లో మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు.