11-02-2025 01:33:57 AM
* కసరత్త్తు వేగవంతం చేసిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): గ్రూప్ ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యంకనం ముగియడంతో ఫలితాల వెల్లడిపై టీజీపీఎస్సీ దృష్టిసారించింది.
రాష్ట్రంలో 563 గ్రూప్ పోస్టుల భర్తీకి జీవో నెం.29కి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 3న కొట్టివేసి గ్రూప్ ఫలితాల వెల్లడికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసి ఆయా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతోపాటు మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టనుంది.
గ్రూప్ ఫలితాల తర్వాత గ్రూప్ 2, 3 ఫలితాలను విడుదల చేసి అనంతరం కొత్త నోటిఫికేషన్లపై దృష్టి సారించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 31లోగా ఉద్యోగాల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖరాసింది. ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఈసారి జారీ చేసే ఉద్యోగ నియామక ప్రకటనల్లో పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.