- ఈనెల 12 వరకు కీపై అభ్యంతరాల స్వీకరణ
- టీపీబీవో ఫలితాలు విడుదల
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): గ్రూప్-3, సీడీపీవో పరీక్షల ప్రాథమిక కీ లను టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. 1,365 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్ 17, 18వ తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2,69,483 మంది పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-3 ప్రిలిమినరీ కీపై ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల ను స్వీకరించనున్నారు. ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలు తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాలని సూచించారు.
రచయిత పేరు, ఎడిషన్, పేజీ నెంబర్, పబ్లిషర్స్ పేరు, వెబ్‌సైట్ వివరాల ను స్పష్టంగా పంపించాలన్నారు. ఈమెయిల్, నేరుగా అభ్యంతరాలను పంపితే పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
సీడీపీవో కీ విడుదల..
మహిళా శిశు సంక్షేమ శాఖలోని సీడీపీవో పోస్టులకు సంబంధించిన పరీక్ష ప్రాథమిక కీ ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈనెల 3, 4వ తేదీల్లో పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రాథమిక కీ ని విడుదల చేసింది. రెస్పాన్స్ షీట్లను సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కీ పైనా ఏవై నా అభ్యంతరాలు ఉంటే ఈనెల 9 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించింది.
టీపీబీవో ఫలితాలు విడుదల..
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీపీబీవో ఉద్యోగాలకు ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంచింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలోని 171 పోస్టులకు 2022 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేయగా, 2023 జూలైలో పరీక్షలను నిర్వహించారు.