calender_icon.png 31 October, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

08-07-2024 12:25:21 AM

  • మెయిన్స్‌కు 31,382 మంది అర్హత

అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత కమిషన్ తుది కీ విడుదల చేసింది. అనంతరం ఫలితాలు వెల్ల డించింది. ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని కమిషన్ అధి కారులు తెలిపారు. గ్రూప్--1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ తెలిపింది.

జూన్ 13న ప్రిలిమినరీ కీ తో పాటు ప్రధాన ప్రశ్నపత్రాన్ని అభ్యర్థుల లాగిన్‌లో అందుబా టులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో https://www.tspsc. gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 

1:100 నిష్పత్తి కోసం ఆందోళనలు

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో చేయాలని విద్యార్థి సంఘాలు, కొందరు అభ్యర్థులు నిరసనలు చేపట్టినా బోర్డు అందుకు ససేమిరా అంది. ముందునుంచి చెప్తున్నట్లుగానే గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేసింది. సాధారణ పరిపాలన శాఖ జారీచేసిన జోవో 29,55 నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటన కూడా చేసింది.

దీనిపైై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 1:100 నిష్పత్తిలోని ఎంపిక చేసి ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం చేయాలని పిటిషన్ వేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం ఈ సమస్యను చట్టానికి లోబడి త్వరితగతిన కమిషన్ చర్యలు తీసుకోవాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను పరిశీలించిన టీజీపీఎస్సీ 1:100 పద్ధతి సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం 1:50 కొనసాగి స్తున్నామని చెప్పి ఆదివారం నాడు ప్రధాన కీతో పాటు ప్రిలిమినరీ పూర్తి ఫలితాలను విడుదల చేసింది.

సీఎం శుభాకాంక్షలు

గ్రూప్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షల్లో కూడా వారు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేక పోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించు కోవడం దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించేవరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం వ్యాపకంగా పెట్టుకున్న అభ్యర్థులు ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.