టీజీపీఎస్సీ ప్రకటన
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): గ్రూప్స్ 3 పరీక్షలు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టుల్లో వాస్తవం లేదని, వాటిని ఖండిస్తూ బుధవారం టీజీపీఎస్సీ ఓ ప్రకటన జారీ చేసింది. ఫేక్ వార్తలను అభ్యర్థులు విశ్వసించవద్దని పేర్కొన్నది. గ్రూప్ పరీక్షలను ఆగస్టు 7, 8వ తేదీల నుంచి నవంబర్ 17, 18వ తేదీలకు, గ్రూప్ నవంబర్ 17, 18వ తేదీల నుంచి ఇదే నెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయని, ఆ ప్రకటనలు వాస్తవం కాదని స్పష్టం చేసింది. మరోవైపు డీఎస్సీ, గ్రూప్ పరీక్షలు ఒకరోజు వ్యవధిలో నిర్వహించడంపై నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం చేస్తున్న సంగతి తెలిసిందే.