- నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం
- భువనగిరి ఎంపీ చామల, ఎమ్మెల్సీ వెంకట్
- నిరుద్యోగులతో సమావేశమైన ఎంపీ, ఎమ్మెల్సీ
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): నిరుద్యోగుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్తామని భువనగిరి ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రూప్ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, డీఎస్సీ పరీక్షను చక్కగా రాసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. గురువారం బేగం పేటలోని టూరిజం ప్లాజాలో ఎమ్మెల్సీ వెంకట్‌తో కలిసి నిరుద్యోగులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రూప్ 2ను నవంబర్ నెలాఖరుకు, లేదా డిసెంబర్ చివరి వారం వరకు వాయిదా వేయాలని, పోస్టులను పెంచాలని నిరుద్యోగులు కోరగా.. సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
గ్రూప్ 1:100 వరకు ఇంటర్వ్యూకు పిలవాలని కోరగా.. సాంకేతికంగా సాధ్యం కాదని ఎంపీ చామల పేర్కొన్నారు. ఈ సం దర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నిరుద్యోగుల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నార ని, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాలని సీఎం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఖాళీలు భర్తీ చేశారో అంద రికీ తెలుసన్నారు. మూడు నెలల కాలంలోనే 30 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని, జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని ఎంపీ వివరించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంక ట్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. డీఎస్సీ, గ్రూప్ పరీక్షకు మధ్య తక్కువ వ్యవధి ఉం దని, ఇది ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తేదీ కాదన్నారు. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టే సీఎం దృష్టికి తీసుకెళ్తాతామని తెలిపారు.