కూకట్పల్లి : గ్రూపు వన్ ప్రధాన పరీక్షలకు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తో పాటు అవినాష్ కళాశాలలో గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా సెంటర్లలో అధికారులు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా పరిధిలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాలలో 17, 700 అభ్యర్థులు పరీక్షకు హాజరు కారునట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. వికలాంగుల కోసం మేడ్చల్ జిల్లాలో నాలుగు సెంటర్లు ఉన్నాయన్నారు ఇప్పటికే వాటన్నింటిని పరిశీలించడం జరిగింది. కూకట్పల్లి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్లో 114 మంది పరీక్ష రాయన ఉన్నారని తెలిపారు. వికలాంగులకు సహాయంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను అందుబాటులో ఉంచామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం భోజన వసతి కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం పరీక్షల్లో రాణించాలని ఆమె పేర్కొన్నారు.