calender_icon.png 20 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలి

19-04-2025 12:00:00 AM

సీఎంకు బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని తెలిపారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆమె శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయ ని పేర్కొన్నారు.

ఈ పరీక్షపై పలు రకాల సందేహాలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరిం చిందని, అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేక్ వేసిందన్నారు.