calender_icon.png 20 October, 2024 | 6:33 PM

అశోక్ నగర్ లో ఉద్రిక్తత.. గ్రూప్-1 అభ్యర్థుల అరెస్ట్

20-10-2024 02:05:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గత ఐదు రోజుల నుంచి గ్రూప్-1 అభ్యర్థులు అశోక్ నగర్ లో గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. అయిన ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. దీంతో అభ్యర్థులు అశోక్ నగర్ లో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. లాఠీఛార్జ్ వద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏంటన్న అభ్యర్థులు ప్రశ్నించారు. పోలీసుల తీరు మారడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గాంధీభవన్ ముట్టడికి గ్రూప్-1 అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు గాంధీభవన్ వద్ద భారీగా మోహరించారు. గ్రూప్-1 అభ్యర్థులకు మద్ధుతుగా శనివారం కేంద్రమంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ కు వెళ్లారు. ఆయన రాకతో భారీగా అభ్యర్థులు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. కాగా, బండి సంజయ్ అభ్యర్థులతో కలిసి సచివాలయానికి బయలు దేరారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాసోజ్ శ్రావణ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు మద్ధతుగా అశోక్ నగర్ వెళ్లడంతో వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.