calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్

28-10-2024 02:14:54 AM

చివరి రోజు 21,151 మంది అభ్యర్థుల హాజరు

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష లు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం పేపర్-6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై జరిగిన పరీక్షకు 31,403 మంది అభ్యర్థులకు గాను  21,151 మంది (67.3 శాతం) హాజరయ్యారు. మెయిన్స్ నిర్వహణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్  మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏడు రోజలు పాటు ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఏడు రోజలు పాటు జరిగిన పరీక్షల్లో మెయిన్స్‌కు అర్హత సాధించిన దాదాపు 30 శాతం మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయకపోడవం గమనార్హం. అర్హత సాధించిన వారు పరీక్షకు రాకపోవడంతో కాంపిటీషన్ కూడా భారీ తగ్గినట్టు అయ్యింది. 

హాజరైన అభ్యర్థుల వివరాలు 

* 21న జరిగిన జనరల్ ఇంగ్లిష్ పరీక్షకు 72.4% 

* 22న నిర్వహించిన పేపర్ -1కు 69.4%

* 23వ తేదీ జరిగిన పేపర్-2కు 68.2%

* 24వ తేదీన జరిగిన పేపర్-3కు 67.7%

* 25వ తేదీన జరిగిన పేపర్-4కు 67.4%

* 26వ తేదీన నిర్వహించిన పేపర్-5 పరీక్షకు67.4%

* 27వ తేదీన జరిగిన పేపర్-6 ఎగ్జామ్‌కు 67.3%