calender_icon.png 4 February, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సరస్వతి విద్యానిలయంలో సామూహిక అక్షరాభ్యాసం

04-02-2025 12:00:00 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 3 : జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యానిలయం లో సోమవారం వసంత పంచమి, సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా  పాఠశాల కరస్పాండెంట్ యానాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో డా.ఓ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం  వినాయక స్వామి, సరస్వతి దేవి దేవతామూర్తుల కు వేదపండితులు ప్రత్యేక  పూజలు చేశారు.

అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోని కుంకుమ,  అమ్మవారి ఫోటో అందజేశారు. ఈ కార్యక్రమంలో  డా.మురళీధర్ రెడ్డి, గార్ల పాటి వెంకటయ్య, శ్రీధర్, గుండా రమేష్, ప్రభాకర్, హైమావతి, వెంకట్ రెడ్డి, నరేంద్ర రావు, వాసవి క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ,  సభ్యులు తదితరులు పాల్గొన్నారు.