calender_icon.png 7 March, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

10-12-2024 02:39:17 AM

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): గ్రూప్ పరీక్షల హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం వెబ్‌సైట్‌లో పొం దుపరిచింది. ఈనెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు గ్రూప్ పరీక్షలు నిర్వహిం చనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనుండగా అందు కు ఏర్పాట్లను టీజీపీఎస్సీ పూర్తి చేసింది.

మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెం బర్ 28న గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, దాదాపు 5.5 లక్షల మంది దరఖా స్తు చేసుకున్నారు. రాష్ర్టవ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ గతంలో 16 రకాల ఉద్యోగాలే ఉండగా.. కొత్తగా ఆరు కేటగిరీ పోస్టులను భర్తీచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా చేర్చిన కేటగిరీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ర్రాష్ట ఎన్నికల కమిషన్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్  విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. వాస్తవంగా గ్రూప్ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్నది.

అయితే డీఎస్సీ, గ్రూప్ పరీక్షలకు మధ్య వారం వ్యవధి మాత్రమే ఉండటంతో అప్పట్లో నిరుద్యోగులు రోడ్డెక్కి పోస్టులను కూడా 2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తలొగ్గిన రేవంత్ సర్కారు పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేసింది. ఇప్పుడు కూడా ఆర్‌ఆర్‌బీ, గ్రూప్ పరీక్షలు ఒకే తేదీల్లో ఉండటంతో గ్రూప్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. 

అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు 

* ఉదయం సెషన్‌లో 9:30గంట లకు, మధ్యాహ్నం సెషన్‌లో 2:30 గంటలకు పరీక్షాకేంద్రాల గేట్లు మూసివేస్తారు.

* అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కా ర్డు, ఓటర్ ఐడీ, ప్రభుత్వ గుర్తిం పుకార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలి.

* సెల్‌ఫోన్లు, బ్లూటూత్ వంటి వాటి తో పరీక్షకు హాజరవడం నిషేధం. ఈ నిబం ధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులకు అప్పగించి చట్టప్రకారం శిక్షిస్తారు.

* మొదటి సెషన్ పరీక్షకు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే అభ్యర్థులు మిగతా మూడు సెషన్‌లకు తీసుకెళ్లాలి.

* గడులను నింపడంలో పొరపాట్ల నివారణకు మాడల్ ఓఎమ్మార్ ఆన్సర్ షీట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ లో పొందు పరిచారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

* వికలాంగులు, ఆన్‌లైన్‌లో స్క్రుబ్ ఆప్షన్‌ను ఎంచుకున్నవారికి టీజీపీ ఎస్సీ అధికారులే స్క్రుబ్ (సహాయ కులు)ను కేటాయిస్తారు.