25-04-2025 12:01:22 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : తెలంగాణ గ్రూప్ ఫలితాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు బీసీ ఆజాది ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్‌గౌడ్ తెలిపారు. గురువారం ఢిల్లీలో సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ ఫలితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని జారీ చేయడంతో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ , మైనార్టీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. గ్రూప్ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీబీఐ అధి కారులను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ నాయకు లు చాపర్తికుమార్‌గాడిగె, బత్తుల రాంనర్సయ్య, చతుర్భుజ్ తదితరులు పాల్గొన్నారు.