హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ -2 పరీక్షను డిసెంబర్ కు టీజీపీఎస్సీ వాయిదా వేసింది. పరీక్ష తేదీలను తరువాత వెల్లడిస్తామని చెప్పిన టీజీపీఎస్సీ ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేసింది. గ్రూప్ 2 వాయిదా వేయానలని అభ్యర్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్ చర్చలు జరిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. కొత్త తేదీలని త్వరలోనే ప్రకటిస్తామని సర్కార్ తెలిపింది. గ్రూప్ - 2లో 783 పోస్టులకు 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.