- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు
- గంట ముందే సెంటర్లకు చేరుకోవాలంటున్న అధికారులు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయ క్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు గ్రూప్-3 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1,401 పరీక్షా కేంద్రాల్లో 5.36 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. అందుకు అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-1కు 8.30 కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
మధ్యాహ్నం పరీక్షకు 1.30 గం టలలోగా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ఉదయం 9.30 తర్వాత, మ ధ్యాహ్నం 2.30 గంటల తర్వాత కేం ద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపుకార్డుతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. తుది ఎంపిక పూర్తయ్యే వరకు హాల్‌టికెట్, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో 102 పరీక్ష కేంద్రాలు
గ్రూప్-౩ పరీక్షలకు జిల్లావ్యాప్తం గా 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12.30గంటల వర కు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్-2 (హిస్టరీ, పొలిటికల్ అండ్ సొసైటీ) పరీక్ష ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్) పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
గ్రూప్-3 పరీక్షలకు హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేం ద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే ఆర్టీసీ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. వివరాలకు కోఠి బస్ స్టేషన్ 9959226160, రేతిఫైల్ 9959226154 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.