calender_icon.png 21 April, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు..

16-12-2024 08:36:11 PM

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. 2వ రోజు పరీక్షల్లో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రెండవ రోజు పరీక్షకు 10,428 మంది హాజరుకావాల్సి ఉండగా, 5,761 మంది హాజరయ్యారని తెలిపారు. 4667 మంది గైరాజరయ్యాను అన్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.