హైదరాబాద్,(విజయక్రాంతి): అశోక్ నగర్ లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. అయితే గ్రూప్-4 అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టిను కలిసేందుకు అశోక్ నగర్ వచ్చారు. తమ సమస్యలు చెప్పేందుకు యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ సమస్యలు ఏమానుంటే ప్రజాభవన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు.