calender_icon.png 13 January, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 72.4% హాజరు

22-10-2024 01:57:48 AM

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు తొలిరోజు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈమేరకు సోమవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే అర్హత పరీక్షైన ఇంగ్లీష్‌కు తొలి రోజు 22,744 (72.4 శాతం) మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. మెయిన్స్‌కు మొత్తం 31,383 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే.

మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో 20 మంది అదనంగా స్పోర్ట్స్ అభ్యర్థులున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 కేంద్రాల్లో పరీక్ష జరిగినట్లు పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.