24-03-2025 01:30:09 AM
నిజామాబాద్ మార్చి ౨౩: (విజయ క్రాం తి): నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండు ముఖం పడుతున్న పంటలను చూసి రైతులు కంటతడి పెడుతు న్నారు. మరోవైపు జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వాన కారణంగా 2,312 మంది రైతులు నష్టపోయారు.
ఒక రెండు రోజుల క్రితం వరకు భూగర్భ జలాల నీటిమట్టం అట్టడుగు స్థాయి పడిపోతుండ డంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగం చేతికి వచ్చిన పంట ఎండు ముఖం పడుతుండడం పంటను రక్షించుకునే ప్రయ త్నాలు చేస్తున్న రైతాంగం పై హఠాత్తుగా వడగండ్ల వాన విరుచుకుప పడింది.
ఈ వడగళ్ల వాన నిజామాబాద్ జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. నిజాంబాద్ రూరల్ పరిధిలో సిరికొండ మండలంలో అత్యధికంగా 506 ఎకరాల్లో ధర్పల్లి మండలంలో 324 బోధన్ పరిధిలోని నవీపేట మండలంలో పండంటి ఎకరాలు కలిపి మొత్తం 884 ఎకరాల్లో మొక్కజొన్న పంట వడగండ్ల వాన దాటికి దెబ్బతింది.
ప్రస్తుత వరి పంట ల సీజన్ లో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు వేసిన పంటలు పొట్ట దశకు వచ్చి చేతికి అందే సమయంలో జిల్లాలోని వరి పంటలు ఎక్కడికక్కడ ఎండిపో తూనే ఉన్నాయి. యాసంగి సీజన్ లో వరి పంటనే అధికంగా రైతులు సాగు చేశారు వేసవి ప్రాథమిక దశ నుంచే రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలకు నీరు అందడం లేదు.
25 నుండి 30 రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందే ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉంది పెట్టిన పెట్టుబడి తెచ్చిన అప్పుల పరిస్థితి తలుచుకొని రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు. కంటతడి పెడుతున్న రైతులను ప్రజాప్రతినిధులు పలకరించిన పాపాన పోలేదు. తూతూ మంత్రంగా అధికారులు గ్రామాలకు వెళ్లి పట్ట నష్టాన్ని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 900 కు పైగా ఎకరాల్లో వరి పంట ఎండు ముఖం పట్టి చేతికి రాకుండా పోతుంది. సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరుకుంటున్న పంటలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 900 ఎకరాల పైగా ఉంది. దిక్కుతోచని స్థితికి జిల్లా రైతాంగం చేరుకుంది.
జిల్లాలో ప్రస్తుత వరి పంట పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది పెట్టిన పెట్టుబడులు చేతుకు రాక వేసిన పంటకు సాగు నీరంధక బోర్లు ఎత్తిపోయి నిజాంసాగర్ సాగు నీరు చివరి ఆయకట్టుకు అందక జిల్లాలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటలను కాపాడుకునే ప్రయ త్నం చేస్తూనే ఉన్నారు. జిల్లాలో 2500 ఎకరాలకు పైగా వరి పంట దాదాపుగా ఎండి పోయిందని చెప్పవచ్చు.
గతంలో జిల్లా మొత్తం మీద వరి పంట నాలుగు పాయింట్ 4.20 లక్షల ఎకరాల మేరకు ఉంటుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో వేల ఎకరాల పంటలు చేతికి వచ్చే దశలో ఎండిపోయే ప్రమాదం ఉంది.
ఎండలు తీవ్ర తరం అవుతున్న దృశ్య భూగర్భ జలాలు 14 మీటర్లకు పైగా అడుగంటి పోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ డిష్పల్లి బాల్కొండ ధర్పల్లి ఇందల్వాయి సిరికొండ నవీపేట్ నందిపేట్ లలో వరి పంట లు ఎక్కువగా ఎండిపోతున్నాయి.
వేసవి తీవ్రతరం అవుతుండడంతో భూగర్భ జలాలు ఎప్పటికప్పుడు పడిపోతూ న్నాయి. బోధన్ డివిజన్లోని లింగాపూర్ నిజాంపూర్ రాంపూర్‌లోని పంటలకు దాదాపు 600 ఎకరాలకు పైగా నిజాంసాగర్ చివరి ఆయకట్టు నీరు అందకపోవ డంతో ఇక్కడి పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. గతంలో అధికారులు దఫళ వారీగా నీటిని విడుదల చేసినప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండు ముఖం పట్టాయి.
డిచ్పల్లి మండలంలో 250 ఎకరాలు ఇందల్వాయి మండలంలో 200 ఎకరాలు నిజాంబాద్ రూరల్ మండలంలో 150 ఎకరాలు జక్రాన్ పల్లి మండలంలో 200 ఎకరాలు ధర్పల్లి మండలంలో 280 ఎకరాలు సిరికొండ మండలంలో 350 ఎకరాలు జక్రాన్ పల్లి మండలంలో 200 పైగా ఎకరాలు మోపాల్ మండలంలో 180 ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయినట్టు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంటల కు బోర్ల నుండి నీరు అందక ఎండి పోతుండగా నీటిపారుదల శాఖ దఫల వారీగా విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు అందక రైతులు వేసిన వరి పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి పెరుగుతున్న వేసవి దృశ్య ఇంకా తీవ్రతరం కానుంది.