calender_icon.png 6 March, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేయాలి

06-03-2025 12:23:11 AM

వనపర్తి టౌన్, మార్చి 05 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేసి, లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ 100శాతం పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని ఆదే శించారు. మహిళా స్వయం సహాయక బృందాలకు  బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.30 కోట్ల లక్ష్యాన్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. గ్రూప్ యూనిట్లు, వ్యక్తిగత యూనిట్లు సంబంధిత  బ్యాంకు సహకారంతో మంజూరు చేయించాలన్నారు. సమా వేశంలో డిఆర్‌డిఓ ఉమాదేవి, డీపీఎం భా షానాయక్, ఏఎల్డిఎం సాయి పాల్గొన్నారు.