03-03-2025 12:00:00 AM
రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
మునిపల్లి, మార్చి 2: దత్తాత్రే మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండ లంలోని బుదేరా చౌరస్తాలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోనూతనంగా నిర్మించనున్న వైదిక పాఠశాల భవన నిర్మాణానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేసి చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్, బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి, వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ ఈ ప్రాంతంలో వైదిక పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అంతకుముందు బర్దిపూర్ ఆశ్రమానికి సంబం ధించిన జ్ఞాపకని మంత్రికి అందజేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయం లో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పాండు, మనోహర్, మాజీ కో ఆప్షన్ సభ్యు డు రహీం, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు పాల్గొన్నారు.