30-04-2025 06:38:28 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి టీఎన్జీవో(Kamareddy TNGOs) నూతన భవన నిర్మాణానికి బుధవారం జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి(Narala Venkat Reddy) భూమిపూజ నిర్వహించారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సమీపంలో టీఎన్జీవో భవనానికి కలెక్టర్(Collector) స్థలాన్ని కేటాయించారు. బుధవారం అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా భూమిపూజ నిర్వహించడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. స్థలాన్ని కేటాయించిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి నాగరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, రాజలక్ష్మి, రాజేశ్వర్, ఎంసీ పోచయ్య, జాయింట్ సెక్రటరీలు ఖదీర్, రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్,కల్చరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.