calender_icon.png 16 April, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

14-04-2025 11:05:16 PM

కొల్చారం (విజయక్రాంతి): మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సోమవారం సాయంత్రం గ్రామస్తులు యువజన సంఘాల సభ్యులు భూమి పూజ చేశారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజయ్యకు చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు స్థలం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి 765 డి నుండి గ్రామంలోకి వెళ్లే పంచాయతీ రాజ్ రోడ్డు మార్గంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు భూమి పూజ చేశారు. అక్కడే శివాజీ జెండా ఆవిష్కరణ చేశారు. త్వరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్, రాజేందర్ గౌడ్, సంతోష్, అరికెల నాగయ్య, కుమ్మరి నాగరాజ్, దుర్గాప్రసాద్ గౌడ్, సారా సుదర్శన్, పాండ్ర అఖిల్, ఎండుగుల కృష్ణ, ఎం సత్యనారాయణ, వర్కల చంద్రశేఖర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.