అర్మూర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) : ఆలూర్ మండల కేంద్రంలోని వేయి నామాల వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
పూజలు చేసి భూమి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర విజయ్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.