19-03-2025 10:52:43 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో ఇరుకైన అద్దె భవనంలో అరకూర వసతులు సౌకర్యంతో ఉన్న భవనాన్ని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక స్థలంలో నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్య సుభాష్ రెడ్డి ఆయన సొంత స్థలంలో ఐదు నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం, హాస్టల్ సౌకర్యాలు కలిగిన అనువైన భవనాన్ని నిర్మించే విద్యార్థులకు ఇవ్వడానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబాపూలే ఆర్ సి ఓ, ప్రిన్సిపాల్, దోమకొండ బిబిపేట్ మండలాల నాయకులు పాల్గొన్నారు.