calender_icon.png 1 February, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణానికి భూమి పూజ

01-02-2025 12:02:04 AM

ఆమనగల్లు, జనవరి 31 ( విజయ క్రాంతి ):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా శుక్రవారం ఆమనగల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌజ్ ఇంటి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుసుమ మాధురి తహసిల్దార్ లలిత పంచాయతీరాజ్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ అనిత విజయ్, బాలాజీ సింగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, మాజీ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి జగన్, విజయ్ రాథోడ్, మెకానిక్ బాబా తదితరులు పాల్గొన్నారు.