12-04-2025 01:25:28 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ కాలేజీ నూతన భవనానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్లు నిధులు మంజూరి చేసింది. ఈ సందర్భంగా ఈ రోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎం.పి.డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి , కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్‌లతో కలిసి భూమి పూజ చేసారు.
వరంగల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ కళాశాల అతి త్వరలోనే రాబోవు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ కళాశాల స్థాయికి ఎదిగేళా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యేగా మీకు హామీ ఇస్తున్నానని అన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతా దశాబ కాలం పాటు పాలించిన గత ప్రభుత్వ హయంలో సాంకేతిక విద్యా శాఖా పరిధిలో వరంగల్ ప్రభుత్వ మహిళా వృత్తి విద్యా కళాశాలను మూసివేయడం జరిగిందన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు మాట్లాడుతూ గత పదేండ్లలో బిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధిని పేడ చెవిన పెట్టిందని, వారు కేవలం తమ అభివృద్ధి ని మెరుగు పరచుకోవడం తప్ప నగర అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్, డాక్టర్ రామ్ ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థి సంఘం నాయకులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ.వి. శ్రీనివాస్ రావు, మేకల అక్షయ్ కుమార్, శ్రీ విద్య, కుమ్మరి వేణు, బానోత్ వెంకన్న, రవితేజ, కుమార్, దయాకర్, శ్రీలేఖ, కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రామనారాయణ, వెంకట నారాయణ, బోధనా సిబ్భంది, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, బంక సరళ సంపత్ యాదవ్, రహీమున్నిసా బేగం, అంబేద్కర్ రాజు తాళ్ళపల్లి మేరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు