calender_icon.png 12 April, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి సమీపంలో గ్రీన్‌విచ్ విల్లాకు భూమి పూజ

28-03-2025 12:51:41 AM

అనంతరం ఘనంగా గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి హోమం

అత్యాధునిక సౌకర్యాలతో ప్రాజెక్టు నిర్మాణం

హైదరాబాద్, మార్చి 27: సన్‌సిటీ, గచ్చిబౌలీ ప్రాంతాలకు సమీపంలో కొత్తగా నిర్మించబోయే గ్రీన్‌విచ్ విల్లాకు ప్రముఖ ప్రణవ గ్రూపు గురువారం భూమి పూజ నిర్వహించింది. ఇదే సమయంలో గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని కూడా ప్రణవ గ్రూపు ప్రతినిధులు అత్యంత ఘనంగా నిర్వహించారు. కొనుగోలుదారులకు ప్రశాంతమైన జీవనంతోపాటు ఆధునిక జీవనశైలిని అందించే విధంగా కొత్త ప్రాజెక్టును తీర్చిదిద్దినట్టు నిర్వాహుకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లబ్‌హౌస్, స్మిమ్మింగ్‌పూల్, విశాలమైన గార్డెన్, వెల్‌నెస్ సెంటర్, పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలం వంటి సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు.

హోమం సందర్భంగా ప్రణవ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్‌బాబు బూరుగు మాట్లాడుతూ.. ‘లగ్జరీ, సౌకర్యం, స్థిరమైన జీవనానికి తమ ప్రాజెక్టును ల్యాండ్‌మార్క్‌గా నిలపాలనే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. పూజా కార్యక్రమం ద్వారా మా రెసిడెంట్లు ప్రపంచ స్థాయి జీవన అనుభవాన్ని పొందారు. ఫేజ్ 2లో భాగంగా నగర కేంద్రంలో ఒక  విల్లా ప్రాజెక్టును తీసుకురావడానికి సంతోషిస్తునానం. 9 ఎకరాల్లో 90 విల్లాలతో కూడిన ప్రీమియం విల్లా ప్రాజెక్టు ఇది. 9 ఎకరాల్లో నిర్మించబోతున్న 90 విల్లాల ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్టులో అల్ట్రా లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నాం. రిసార్టు విల్లా ప్రాజెక్టులా రూపుదిద్దుకుంటున్న ఈ ఐజీబీఎస్ గోల్డ్ సర్టిఫైడ్ ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి 26 నాటికి పూర్తి చేస్తాం.

సన్‌సిటీ, గచ్చిబౌలీ ప్రాంతాలను ఈ ప్రాజెక్టు అత్యంత సమీపంలో ఉంది. అందువల్ల ఇది విలువ ఆధారిత ప్రాజెక్టు అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. వీటితోపాటు హస్తినాపురం ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో 9 అంతస్తుల భవనం, రుద్రాన్ష్ కౌంటీలోని రాయగిరి ప్రాంతంలో టెంపుల్ స్వేర్ పాట్లు, నల్సార్ రోడ్డు ప్రాంతంలో మరో ప్లాటింగ్ ప్రాజెక్టును చేబడుతున్నాం‘ అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లోకానీ 9100932223/ 9228056789 నెంబర్లను సంప్రదించాలని కోరారు. కాగా హోమానికి ప్రణవ గ్రూపు చైర్మన్ రవి కుమార్ బూరుగు, గ్రూపు డైరెక్టర్ అశోక్ బండారు, కొనుగోలుదారులు తదితరులు పాల్గొన్నారు.