05-04-2025 08:02:59 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో గల స్థానిక ఎల్లమ్మ చౌరస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని అట్టడుగు వర్గాల ప్రజలు విజ్ఞాన పరంగా ముందుకు వెళితేనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఆకాంక్షించారని అన్నారు.
దేశంలో ఆర్థిక అసమానతలు
దూరం కావాలంటే విద్యతోనే సాధ్యమని అనగారిన వర్గాలకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత కోసం జగ్జీవన్ రామ్ కృషి చేశారని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో సృష్టికర్త జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బిజెపి నాయకులు బుద్ధ మహేందర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ కరుణాకర్, ఎం.జెఏ.ఫ్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు శివదాస్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి, బిఅరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు, జేఏసి అధ్యక్షుడు యాదగిరి, బిఅరెస్ నాయకులు మహేష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, ఎమ్ ఎమ్ జే ఎఫ్ నాయకులు భాస్కర్, ఎమ్ యి ఎఫ్ నాయకులు ప్రణయ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాజు, మండల నాయకులు దినేష్, నాగరాజు, బాబు, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.