19-03-2025 12:00:00 AM
పెద్ద కొడప్ గల్ మార్చి 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి తండా, వడ్లం గ్రామాలలో సీసీ రోడ్డు పనులు, కుబ్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేం దర్ రెడ్డి మంగళ వారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
నాయకులను, అధికారులను సమన్వయ పరిచి పనులు వేగంగా కొనసాగే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిప్ప మోహన్, మల్లప్ప పటేల్, శ్యామప్ప, పండరి, అహ్మద్, గంగా గౌడ్, భార్థ్యా నాయక్, పాండు నాయక్, శ్రీనివాస్, బాబుదేశాయ్, మష్ణుపటేల్, ఇస్మాయిల్ పటేల్, ఆకుల రాం చందర్, అంబయ్య తదితరులు పాల్గొన్నారు.