29-03-2025 02:21:43 AM
200 ఎకరాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మాణం
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీల ఆసక్తి
క్లియర్ టెల్లిజెన్స్ ఇండియా సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 28(విజయక్రాంతి) : ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో శుక్రవారం ఆయన క్లియర్ టెల్లిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
భావితరాల అవస రాలకు అనుగుణంగా, సుస్థిరాభివృద్ధే ల క్ష్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్ సి టీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామన్నారు. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయని చెప్పారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీలో హబ్‌గా మారు తుందన్నారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను ప్రారంభించామని, త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్‌లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. టెక్నాలజీ అంటేనే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, వారికి ప్రభుత్వం తరఫున అ న్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదిగితే రాష్ట్రం కూడా వృద్ధి చెందుతుందన్నారు. ప్రతిభ ఉన్న యువతే తెలంగాణకు అతిపెద్ద ఆస్తి అన్నా రు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీ కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయని.. వాటికి పరిష్కారాలను కనుక్కునేం దుకు కొత్తగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు.
ఏఐ, డేటా ఇంజినీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సొల్యూ షన్స్ తదితర రంగాల్లో సేవలు అందించే క్లియర్ టెల్లిజెన్స్ సంస్థ తమ ఇండియా శాఖను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. లో క్లియర్ టెల్లిజెన్స్ సీఈవో ఓవెన్ ఫ్రివోడ్, మేనేజింగ్ పార్ట్‌నర్ అనిల్ భరాడ్వా, డైరెక్టర్ మురళి పాల్గొన్నా రు.
ఫ్యూచర్ సిటీ యూటర్న్ కాదు రైట్ టర్న్
ఫ్యూచర్ సిటీపై ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్ వేదికగా సూచించారు. ఫ్యూచర్ సిటీ యూ టర్న్ కాదని.. రైట్ టర్న్ అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీపై యూ టర్న్ అంటూ అన్నీ తెలిసిన కేటీఆర్ పేర్కొనడం సరికాదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మా సిటీ.. ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు ప్రత్యేక కేంద్రమ న్నారు. ఆర్టిఫిషియెల్ ఇంటలిజెన్స్ కోసం ఏఐ సిటీ ప్రత్యేకమన్నారు. క్లీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రాలిటీపై దృష్టి సారించి స్థిరమైన అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు.