calender_icon.png 22 April, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత

22-04-2025 01:04:50 AM

 జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 21 (విజయక్రాంతి): భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూగర్భ జలాల పరిరక్షణ పై భూగర్భ జలాల పరిరక్షణ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గృహాలు, పరిశ్రమలు మరియు వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకుడు గుంతలు మరియు ఫామ్ పౌండ్ లు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీ వస్తుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మరియు పట్టణాలలో నీరు ఎక్కడ నిలబడుతుందో, ఇంకుడు గుంతలు ఎక్కడ నిర్మించాలి అనేది గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని ఇం కుడు గుంతల నిర్మాణాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వసతి గృహాల్లో ఇంకుడు గుంతల ని ర్మాణాలను చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఈ వేసవిలో చెరువుల్లో నీటి ని ల్వలు తక్కువగా ఉంటాయని వాటిలో పూడిక తీయు విధంగా చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో ని దమ్మపేట, జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో 16 గ్రామాలలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు ఫామ్ పాండ్ నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో భూగర్భ జల శాఖ ఏడి రమేష్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పబ్లిక్ హెల్త్ శాఖ ఈఈ రంజిత్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, అడిషనల్ డిఆర్డిఏ రవి మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.