20-03-2025 12:29:38 AM
షెట్టర్ సీజ్ చేసిన జిహెచ్‌ఎంసీ అధికారులు
రాజేంద్రనగర్, మార్చి 19 (విజయక్రాంతి): చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఓ వ్యక్తి షెటర్ను రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ కథనం ప్రకారం.. ఏంఏం పహాడీ ప్రాంతంలో డాకెట్ నెంబర్ 608 కి సంబంధించి షట్టర్ యజమాని చాలాకాలంగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో 12 లక్షల బకాయి పడ్డాడు.
రిబేట్ మినహా మినహాయించి తొమ్మిది లక్షలు చెల్లించాల్సి ఉంది. అయినా కూడా సదరు వ్యక్తి ఆస్తిపన్ను చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు సర్కిల్ అధికారులు బుధవారం సదరు ఆస్తిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు అన్నారు. ఎప్పటికప్పుడు చెల్లించాలని సూచించారు..