22-03-2025 12:39:39 AM
21 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో సర్వే
న్యూఢిల్లీ: దేశంలోని రాష్ట్రాల్లో జనాభా ఎలా బిహేవ్ చేస్తుందనే విషయంపై నిర్వహించిన ‘గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్’ (జీడీబీ) సర్వే విడుదలైంది. దేశంలోని 21 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించగా.. కేరళ మొదటి స్థానంలో నిలిచింది. యూపీ, పంజాబ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఆఖరిస్థానంతో సరిపెట్టుకున్నాయి. సివిక్ బిహేవియర్, సేఫ్టీ, జెండర్ ఆటిట్యూడ్స్, డైవర్సిటీ వంటి వాటి అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.
తెలంగాణకు 11
ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానం సంపాదించింది. ఓవరాల్‌గా 11వ స్థానంలో నిలిచిన రాష్ట్రం.. సివిక్ బిహేవియర్‌లో 13, జెండర్ ఆటిట్యూడ్స్‌లో ఆరు, పబ్లిక్ సేఫ్టీ విభాగంలో 12, వివక్షతలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.