calender_icon.png 7 November, 2024 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లికి ఒక రోజు ముందు.. వరకట్నంతో వరుడు ఎస్కేప్

07-11-2024 12:23:53 PM

పెళ్లికి ఒక రోజు ముందు వరుడు అదృశ్యం

హైదరాబాద్: ఇద్దరు లవ్ చేసుకున్నారు. పెద్దలను ఓప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ అంతా ఓకే అయ్యే సరికి ఆ యువతికి అనుకోని షాక్ తగిలింది. విషయం ఏంటంటే సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో పెళ్లికి ఒక రోజు ముందు వరుడు అదృశ్యం అయ్యాడు. ఓ యువజంట  ప్రేమించుకుని పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. రేపు ముహూర్తం ఉండగా నిన్న ఇంటి నుంచి సందీప్ రమేశ్ వెళ్లిపోయాడు. పెళ్లికి వరకట్నంగా సందీప్ రమేశ్ రూ. 10 లక్షల తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి ముహూర్తం వచ్చేసరికి సందీప్ కనిపించకు పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితురాలు మారేడుపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.