హైదరాబాద్: పెద్దవాగు ప్రాజెక్టు అంశంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు సోమవారం సమావేశం అయ్యింది. తెలంగాణ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ ఇంజినీర్లు పాల్గొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మత్తులు, ఆధునీకరణపై జీఆర్ఎంబీ భేటీలో చర్చించారు.