విద్యాశాఖ కమిషనర్‌కు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల వినతి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్‌ఎల్) విడుదల చేసిన తర్వాతే డీఎస్సీ 1:3 జాబితా ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు కోరారు. గతంలో టీఎస్‌పీఎస్సీ టీఆర్టీ నిర్వహించినప్పుడు జనరల్ ర్యాకింగ్ లిస్టు ఇచ్చిన తర్వాతే 1:2/1:3 జాబితా విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇటీవల గురుకుల బోర్డు అందుకు విరుద్ధంగా జీఆర్‌ఎల్ ఇవ్వకుండానే 1:2 జాబితా ఇచ్చారన్నారు. పూర్తి పారదర్శకత పాటించేలా అభ్యర్థులకు స్పష్టత కోసం డీఎస్సీలో జిల్లాలవారీగా జీఆర్‌ఎల్ జాబితా ఇవ్వాలని కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినట్టు డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు.