calender_icon.png 7 October, 2024 | 5:02 AM

ఆనాటి గ్రైండర్..

07-10-2024 12:00:00 AM

ఇసురు రాయి.. ఇది చూడగానే అమ్మమ్మ వాళ్ల ఇల్లు గుర్తుకొస్తది. ఇసురు రాయితో ఒక్కసారైనా పిండి రుబ్బాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ అది అంత తేలికైన పని కాదు. ఇప్పుడంటే దోశలు వేసుకోవడానికి, పిండి రుబ్బడానికి మిక్సీలు, గ్రైండర్లు ఉన్నాయి. కానీ అవి లేని రోజుల్లో ఇసురు రాయితో పప్పులను పిండిగా చేసుకోవడం, నూకలు విసరడానికి ఇసురు రాయి వాడేవారు.

ఆ కాలంలో ఇసురు రాయి మిక్సీతో సమానం. ఇసురు రాయితో విసరడం కబుర్లు చెప్పినంత తేలికకాదు. గింజలు పోసి కొద్దిగాపై రాయి ఎత్తి నెమ్మదిగా విసరాలి. గబ గబా విసిరితే సరిపోదు. దానికోసం చాలా ఓపిక అవసరం. ప్రస్తుతం ఇసురు రాయి కనుమరుగైన దాని జ్ఞాపకాలు మాత్రం నేటికి పదిలంగా ఉన్నాయి.