12-03-2025 06:44:50 PM
బైంసా,(విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బుధవారం భైంసా పట్టణంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. భైంసా సబ్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెనువెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఏఎస్పీ అవినాష్ కుమార్ భైంసా గ్రామీణ సర్కిల్ ఇనస్పెక్టర్ నైలు, ఎస్ఐ అశోక్ మరియు క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు