ఘనంగా జన్మదిన వేడుకలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి జన్మదిన వేడుకలు నివాసంలో ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి కోవలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు మధుకర్ శర్మ, ప్రశాంత్ శర్మ ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు. తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ అభిమానులు, నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, జిఎం శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పనులు పంపిణీ చేశారు.
వినోద్ జస్వాల్, ఎండి అహ్మద్ లో రక్తదానం చేశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ హైమద్, పార్టీ మండల అధ్యక్షుడు జాబరే రవీందర్, నాయకులు అన్సార్, నిసర్, హైమద్, రవి, హైమద్, కాసిం, వివిధ మండలాల చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.