calender_icon.png 28 December, 2024 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

09-11-2024 12:00:00 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెటారు. ‘గౌరవనీయులైన సీఎం గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి.

ప్రజా సేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో రాసుకొచ్చారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని నటి ఖుష్బూ పేర్కొన్నారు.