calender_icon.png 4 December, 2024 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ...

03-12-2024 08:20:46 PM

మంథనిలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని (విజయక్రాంతి): అమ్మ బాగున్నారా... అన్నా ఏం చేస్తున్నారు... అంటూ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడారు. అనంతరం మార్కెట్ రోడ్డులో మహిళా శక్తి పథకం కింద మంజూరైన టైలర్ షాప్, మిల్క్ పాయింట్ లను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చిన సందర్భంగా మంథని మున్సిపల్ కి సంబంధించిన పోచమ్మవాడ, బోయినిపేట రైతులు మంత్రి శ్రీధర్ బాబుకు ఘనంగా సన్మానించారు. అయ్యప్ప మాల ధరించి  శబరిమల సన్నిధానానికి మహా పాద యాత్ర చేపట్టిన మంథని అయ్యప్ప స్వాములను మంత్రి సన్మానించారు. 

మంథని ప్రాంతానికి చెందిన రాష్ట్ర కరాటే పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్దులను మంత్రి అభినందించారు. మంథని మున్సిపల్ సిబ్బందికి దుప్పట్లను మంత్రి శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, రైతు కిషన్సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పార్వతి కిరణ్, మోహన్ యాదవ్, పర్వతాలు యాదవ్, కొట్టే రమేష్, మబ్బు తిరుపతి, గోటికారి కిషన్ యూత్ నాయకుడు శ్రీకాంత్, ఆర్ల నాగరాజు, ఎరుకల ప్రవీణ్, రంజిత్ తదితరులు ఉన్నారు.