calender_icon.png 14 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చదనం.. ఫలహారం

14-02-2025 12:00:00 AM

వరిపొలం.. ఆగమాగం..

పెన్ పహాడ్, ఫిబ్రవరి 13 : ఆరుగాలం కష్టపడే రైతు వరి పంట ఎస్సారెస్పీ అధికా రులు, పాలకుల పుణ్యమంటూ పొట్టదశ లోనే పశువుల పాలు అవుతున్నది. వరిపొలాలకు కాళేశ్వరం జలాలు రాక, ఇటు బోర్లు, బావులలో నీళ్ళు లేక అడిగంటి పోవడంతో పచ్చదనంతో నిగనిగలాడు తున్న పొలాలు నేడు మేకలకు, గొర్లకు ఫలహారంగా మారాయి.

వరి పంట చేతికి వస్తుదని ఆశతో సాగు చేసిన రైతు పరిస్థితి ఇప్పుడు ఆగమాగమై అయోమయంలో పడి దయనీయ పరిస్థితి లో కొట్టు మిట్టాడుతున్నాడు. ఈ హృదయ విధారక ఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నూర్జాన్ పేట, జల్మాల కుంటతండాలో రైతుల దుస్థితి.

మండలం లోని నూర్ణాన్ పేటకు చెందిన జెరుపుల సైదా తనకున్న ఐదు ఎకరాలు, జల్మాల కుంటతండాకు చెందిన భూక్యా బాలకోటి 2ఎకరాలు వరి పొలం సాగు చేశారు. గత 6సంవత్సరాల నుంచి కాళేశ్వరం జలాలు రాకతో వరి సాగు చేశారు. 

ఈయాసంగిలో కాళేశ్వరం జలాలు వస్తాయని ఆశతో సాగు చేయగా అధికా రుల నిర్లక్ష్యం మూలంగా ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువకు పైఎత్తు న ఉన్న రైతులు తూముల ద్వారా ఇష్టా రాజ్యంగా నీళ్ళను మళ్లించడం.. అధికా రులు, సంబంధిత సిబ్బంది తూముల పర్యవేక్షణ లేకుండా గాలికి వదిలి వేయందకో చివరి ఆయకట్టుకు వస్తున్న కాలువ ఎండిపోయి పొట్టదశకు వచ్చిన పొలాలు పూర్తిగా ఎండి పోయాయి.

ఈవిషయమై కనీసం వారబందీ ద్వారా చివరి భూములకు తడుల ద్వారా నీటిని అందించి అదుకోవాలని అధికారులు, పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోక పోవడంతో తాము సాగు చేసిన పచ్చని పొలాలు మేకలకు గొర్లకు ఫలహారంగా మారయని దీంతో రైతులకు గుండెకోతగా మిగిలిందని రైతులు విజయక్రాంతితో తమ ఆవేధన కన్నీటితో వక్తం చేశారు.