06-03-2025 08:30:56 PM
ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి..
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పదో తరగతి విద్య అనంతరం మండలంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులు సుదూరంలోని కొత్తగూడెం, పరిసర ప్రాంతాల్లోని జూనియర్ కళాశాల్లో చేరి ఇబ్బందులకు గురి అవుతూ, ఆర్ధికంగా నష్టపోతుండటంతో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు.
సంబంధిత, ఇంటర్మీడియట్ విద్య అధికారులను సంప్రదించి వత్తిడి తేవడంతో, కళాశాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కళాశాల ఏర్పాటు చేయాలనీ, ఇంటర్మీడియేట్ విద్య డైరెక్టర్ నుంచి ఉన్నత విద్య ప్రిన్సిపాల్ సెక్రటరీ లేఖ రాశారు. దేంతో ఎమ్మెల్యే కూనంనేని కృషి ఫలించినట్లైంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ సుముఖత వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.