calender_icon.png 5 January, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డుకు గ్రీన్ సిగ్నల్

03-01-2025 12:53:42 AM

  1. ప్యారానగర్‌లోని 150 ఎకరాల్లో ఏర్పాటు
  2. పరిపాలనా అనుమతులకు కలెక్టర్ ఓకే!
  3. జవహర్‌నగర్‌కు తగ్గనున్న భారం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుం చి సేకరించిన చెత్త(వ్యర్థాలు)ను నగర శివా రు ప్రాంతం జవహర్‌నగర్‌కు రెండు దశాబ్దాలకు పైగా తరలిస్తున్న సంగతి తెల్సిం దే. అ యితే జవహర్‌నగర్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటైన అనంతరం డంపిం గ్ యార్డును తొలగించాలని స్థానికులు గత కొన్నేళ్లుగా నిరసన తెలుపుతూ వస్తున్నారు. 

ఈ క్రమంలో జవహర్ నగర్‌కు ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలల డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసేందుకు బల్దియా అధికారులు నిర్ణయించారు. అందులో భా గంగానే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ప్యారానగర్‌లో అధునాతన డంపింగ్ యార్డు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది అం దుబాటులోకి వస్తే జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై తీవ్రమైన భారం తగ్గనుంది. 

ప్యారానగర్‌లో గ్రీన్ సిగ్నల్.. 

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి వారం రోజుల క్రితం జవహర్‌నగర్ డంపింగ్ యా ర్డును విజిట్ చేసి అక్కడ జరుగుతున్న చెత్త శుద్ధ్ది నిర్వహణను స్వయంగా పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ప్యారానగర్‌ను సందర్శించినట్టుగాసమాచారం. ప్యారానగర్‌లోని (ఫారెస్ట్ ల్యాండ్) 120 ఎకరాలలో ఏర్పాటు చేయదల్చిన డంపింగ్ యార్డు నిర్మాణానికి అంగీకరించాలని సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కోరారు.

కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే, ఇక్కడ కూడా డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల వైపు నుంచి కూడా సానుకూలత వచ్చేలా స్థానిక జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులతో బల్దియా కమిషనర్ త్వరలోనే కలిసి చర్చించనున్నారు.

ప్యారానగర్‌లో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డు ఎలాంటి దుర్వాసన లేకుండా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉం టుందని అధికారులు చెబుతున్నారు.  ఇదే విషయాన్ని సంగారెడ్డికి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానికులతో చర్చించనున్నారు.

అం తే కాకుండా, దుండిగల్‌లో 85 ఎకరాలలో ప్రస్తుతం ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉండటం చేత డంపింగ్ యార్డుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభ్యంతరం చెబుతోంది. ఇక్కడ కూ డా పీసీబీ ఎన్‌ఓసీ లభిస్తే దుండిగల్‌లో కూడా మరో డంపింగ్ యార్డుకు మార్గం సు గమం అవుతుంది.

అలాగే మల్కారం, లక్డా రం ప్రాంతాలలో కూడా డంపింగ్ యార్డుల నిర్మాణానికి ఆ జిల్లాల కలెక్టర్లకు జీహెచ్‌ఎంసీ లేఖలు రాసింది. ప్రస్తుతం ప్యారానగర్‌లో పరిపాలనా పరమైన అనుమతులు గట్టెక్కడంతో ఇక్కడ ఏర్పాటయ్యే డంపింగ్ యార్డుతో జవహర్‌నగర్‌కు మరిం త భారం తగ్గనుంది. 

8,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు.. 

గ్రేటర్ వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్ల నుంచి ప్రతిరోజూ 8,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇదంతా నగరంలోని పలు ప్రాంతాల నుం చి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు చేరుతుంది. దీంతో పాటు హైదరాబాద్ పరిసరాల్లోని 7కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీల నుంచి కూడా చెత్తనిల్వలు ఇక్కడికే తరలిస్తున్నారు.

ఈ క్రమంలో జవహర్‌నగర్‌కు ప్రత్యామ్నాయంగా నగరంలోని పలు ప్రాంతాలలో డంపింగ్ యార్డులను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ గతంలో భావించింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని మల్కారంలో 200 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో 120 ఎకరాలు, అదే జిల్లా లక్డారంలో 100 ఎకరాలు, మేడ్చల్ జిల్లా దుండిగ ల్‌లో 85 ఎకరాలలో డంపింగ్ యార్డులు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధ్దం చేసింది. అయితే ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ప్రణాళికలు కాగితాలకే పరిమితం అయ్యాయి.