calender_icon.png 30 October, 2024 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరావతి ఓర్‌ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్

07-07-2024 01:47:20 AM

  • రూ.20 నుంచి 25 వేల కోట్లు భరిచేందుకు కేంద్రం సిద్ధం 
  • అమరాతి, హైదరాబాద్ మధ్య ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే 
  • 60 నుంచి 70 కిలోమీటర్లు తగ్గనున్న దూరం

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఏపీ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేసే పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్ర భుత్వం ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పోడవైన ఓఆర్‌ఆర్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ 2014 -19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టి, కొంతవరకు ముందుకు తీసుకెళ్లింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు వాటన్నింటినీ కేంద్రం ముందు ఉంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు.

కేంద్ర రోడ్దు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన ఫైనాన్షియల్ కమిటీ తోపాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆ మోదం పొందిన తర్వాత ఇవన్నీ ఆచరణలోకి వస్తాయి. అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజె క్టు భూ సేకరణ సహా మొత్తం రూ.20 నుంచి రూ.25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించేందుకు ముం దుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపా స్ రోడ్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరాతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60 నుంచి 70 కిలోమీటర్లు తగ్గేలా ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది.