డీసెంట్‌గా నటిస్తూ.. మంచి కథలను ఎంచుకుం టూ కెరీర్‌ను బ్రేకుల్లేకుండా ముందుకు సాగు తోంది సాయిపల్లవి. ఎక్స్‌పోజ్‌కు స్థానమివ్వదు. పెద్దగా మేకప్ హంగామా వంటివేమీ ఉండవు. డ్రెస్సింగ్ కూడా డీసెంట్‌గా ఉంటుంది. అందుకే ఈ ముద్దుగుమ్మను చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
గతేడాది ‘అమరన్’తో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఈ ఏడాది ‘తండేల్’ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు కోలీవుడ్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కోలీవుడ్ స్టార్ శింబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఎస్‌టీఆర్-49’ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం.
శింబు చూస్తే రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాల్లో రొమాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శింబు చిత్రంలో సాయిపల్లవి అంటే ఒకింత ఆశ్చర్యమే. అయితే తన పాత్ర డీసెంట్‌గా ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు కాబట్టి సాయి పల్లవి పాత్రను దర్శకుడు నీట్‌గానే తీర్చిదిద్దవచ్చని అంతా చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైంది. షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే సాయిపల్లవి నటిస్తోందా? కేవలం రూమరేనా? అనేది తెలి యాల్సి ఉంది.