calender_icon.png 9 February, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోల్డ్ పాత్రకు గ్రీన్ సిగ్నల్!

09-02-2025 12:00:00 AM

ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా సాగిస్తున్న నటీమణుల్లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరు హీరోల సరసనా అవకాశం కొట్టేసింది. రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్‌తో ‘రాబిన్ హుడ్’, పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అలాగే తమిళ్‌లో శివకార్తికేయన్‌తో ‘పరాశక్తి’ అనే చిత్రంలోనూ నటిస్తోంది.

చేతిలో నాలుగు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే ఈ మధ్య గీత దాటేందుకు సైతం సిద్ధమని చెప్పకనే చెప్పేసింది. దీనిలో భాగంగానే శ్రీలీల తాజాగా ఓ బోల్డ్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలోనే పాయల్ రాజ్‌పుత్ స్థానంలో శ్రీలీల నటించనుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.