calender_icon.png 4 January, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చికొబ్బరి జెల్లీ

23-07-2024 12:00:00 AM

పచ్చికొబ్బరి అంటే చాలా మందికి ఇష్టం. కొంతమంది కొబ్బరి నేరుగా తినేస్తారు. మరికొందరు చట్నీలు, స్నాక్స్ వంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు. నేరుగా పచ్చికొబ్బరి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. పచ్చికొబ్బరి తినడం వల్ల చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మం, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ఇంతకీ పచ్చికొబ్బరి జెల్లీని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి..

కావాల్సిన పదార్థాలు

పచ్చికొబ్బరి, పంచదార, 

అగర్ అగర్ పౌడర్, లేత కొబ్బరి నీళ్లు. 

తయారీ విధానం

పచ్చికొబ్బరి జెల్లీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే, వంట రాని వాళ్లు కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి కాయలను పగల గొట్టి నీళ్లను తీయాలి. ముక్కలుగా కట్ చేసి కొబ్బరి తురుము తీసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి రాసుకుని.. పొయ్యి మీద పెట్టాలి. అందులో కొబ్బరి తురుము కరిగాక అందులో పంచదార వేసి కరిగించాలి. ఇలా కాసేపు ఉడికా.. అందు లో కొద్దిగా అగర్ అగర్ పౌడర్ వేసి బాగా తిప్పుకోవాలి. ఒక పొంగు వచ్చాక.. తర్వాత పక్కకు పెట్టాలి. ఒక ప్లేటులోకి వేసి చల్లారనివ్వాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. వీటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందు లో లేత కొబ్బరి నీళ్లు వేసి తినాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చికొబ్బరి జెల్లీ సిద్ధం.