calender_icon.png 2 October, 2024 | 6:03 AM

తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు!

02-10-2024 01:14:29 AM

  1. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  2. జపాన్‌లో యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ సంస్థ సందర్శన
  3. ఉమ్మడి భాగస్వామ్యంలో ప్లాంట్ల ఏర్పాటుకు ఆహ్వానం 

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటుచేయడానికి ఇంధన శాఖ సన్నాహా లు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో నీటి వసతి, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశా లు విస్తారంగా ఉన్నందున రాష్ట్ర మంతటా గ్రీన్‌హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయొచ్చ ని, తద్వారా దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా రాష్ట్రాన్ని నిలపాలని భట్టి ఆకాంక్షిం చారు.

జపాన్ పర్యటనలో ఉన్న ఆయన, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరామ్‌తో కలిసి మంగళవారం టోక్యోకు సమీపంలోని యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని సందర్శించారు.

తెలంగాణలో ఇప్పటినుంచే పెద్ద ఎత్తున సోలార్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యమానాషీ కేంద్రంలో గీరన్ మైడ్రోజన్ ఉత్పాదనను స్వయంగా పరిశీలించారు. సౌర విద్యుత్తును ఉపయోగిస్తూ.. నీటిని ఎలక్ట్రోలైజింగ్ పక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే యంత్ర విభాగా లను యమానాషీ సంస్థ రూపొందిస్తోంది.

ఈ విధంగా ఉత్పత్తయిన హైడ్రోజన్‌ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్‌గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేవిగా వినియోగిస్తున్నట్టు అక్కడి నిర్వాహక ఇంజినీర్ కునిగి వివరించా రు. ఈ ప్రక్రియలో థర్మల్ విద్యుత్తు కాకుం డా, సౌర విద్యుత్తును వినియోగిస్తున్నామని..

దీనిని గ్రీన్ హైడ్రోజన్‌గా పేర్కొంటున్నట్టు తెలిపారు. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాల ని అధికారులకుభట్టి సూచించారు. యమానాషీ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొంది స్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం విభాగాన్నికూడా బృందం పరిశీలించింది. 

యమానాషీకి డిప్యూటీ సీఎం ఆహ్వానం 

సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు, త్వరలో ఏర్పాటు చేయను న్న మరో వెయ్యి మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సం దర్భంగా యమానాషీ అధికారులతో భట్టి మాట్లాడుతూ..

తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం సాంకేతికత వినియోగంపై ఉమ్మడి భాగస్వామ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు కలిసి రావాల ని కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయి లో చర్చించి నిర్ణయిస్తామని అన్నారు.

హైదరాబాద్‌లోనూ షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ

ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ ఆదర్శమని, టోక్యోలోని షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమని డిప్యూటీ సీఎం భట్టి కొనియాడారు. మంగళవారం భట్టి బృందం షిబుయా క్రాసింగ్‌ను సందర్శించారు. ఒకేసారి 3 వేల మంది ఆటంకం లేకుండా రోడ్లు దాటడానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

రోజుకు కనీసం 5 లక్షల మంది పాదచారులు ఒక్క చిన్న ప్రమాదం జరక్కుండా హచుకో రైల్వే, రోడ్డు కూడలిని దాటుతున్నారని, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రక్షణతో కూడిన పాదచారుల క్రాసింగ్ అని డిప్యూటీ సీఎం భట్టి ప్రశంసించారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలు జరుపనున్నట్టు భట్టి వెల్లడించారు.